మున్సిపల్ కమిషనర్ ఇంట్లో భారీగా పట్టుబడ్డ నగదు, బంగారం

AP: వినుకొండ మున్సిపాలిటీ రెవెన్యూ అధికారి, దర్శి మున్సిపాలిటీ ఇన్‌చార్జ్ కమిషనర్ యాదాల మహేశ్వరరావుపై ఏసీబీ (ACB) అధికారులు పంజా విసిరారు. ఆదాయానికి మించిన ఆస్తులు (DA) కలిగి ఉన్నారన్న ఆరోపణలతో దర్శి, నరసరావుపేట, సత్తెనపల్లిల్లో ఏకకాలంలో దాడులు చేశారు. ఈ సోదాల్లో నిందితుడు తన కుటుంబ సభ్యుల పేరిట కూడబెట్టిన 9 ఇంటి స్థలాలు, 2 ఫ్లాట్లు, వ్యవసాయ భూమిని గుర్తించారు. వీటితో పాటు 729 గ్రాముల బంగారం, లక్షల కొద్దీ నగదు, 9.2 కేజీల వెండి, భారీగా గృహోపకరణాలను స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్