రూ. లక్ష కోట్లతో రక్షణ రంగానికి భారీ బూస్ట్!

భారత రక్షణ రంగానికి కేంద్ర ప్రభుత్వం రూ. లక్ష కోట్ల భారీ పెట్టుబడిని అందించనుంది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ఈ ప్రతిపాదనపై త్వరలో సంతకం చేయనుంది. ఈ నిధుల్లో ఎక్కువ భాగం భారత సైన్యానికి కేటాయించబడుతుంది. సరిహద్దుల్లో బలాన్ని పెంచడానికి 300 అదనపు 'కే-9 వజ్ర' స్వయం చోదక శతఘ్నులు, ఆత్మాహుతి డ్రోన్లు, రష్యాకు చెందిన 'వెర్బా' మ్యాన్‌ప్యాడ్స్, యుద్ధ ట్యాంకులకు 'యాక్టివ్ ప్రొటెక్షన్ సిస్టమ్స్' (ఏపీఎస్) కొనుగోలు చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్