గుజరాత్ రాష్ట్రం వడోదరలోని నర్హహరి విశ్వామిత్రి బ్రిడ్జి రోడ్డుపైకి 8 అడుగుల భారీ మోసలి వచ్చింది. దాన్ని చూసేందుకు జనం తరలిరావడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. జనం మొసలి చుట్టూ గుమిగూడటంతో అది భయపడింది. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు మొసలిని రక్షించారు. దాన్ని విశ్వామిత్రి నదిలో విడిచిపెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.