తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌ దగ్గర భారీగా నిలిచిన గణనాధులు

TG: హైదరాబాద్‌లో వినాయక నిమజ్జన ఊరేగింపుల కారణంగా తెలంగాణ తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రవీంద్రభారతి, సచివాలయం, టెలిఫోన్ భవన్, లిబర్టీ నుంచి సచివాలయానికి వచ్చే మార్గాల్లో గణనాథుల వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోవడంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. వివిధ ప్రాంతాల నుంచి ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్‌ వైపు విగ్రహాలు వరుసగా వస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕