జియో ప్లాట్‌ఫామ్‌ ఐపీఓకు భారీ డిమాండ్‌

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్‌ రూ.8,110 కోట్ల యాంకర్ బుక్ ఇష్యూకి సంస్థాగత మదుపర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. సుమారు 30 రెట్ల డిమాండ్‌తో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు దాఖలయ్యాయి. అక్టోబర్ 21న ప్రారంభమై 23న ముగిసే ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.30,213 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. షేర్ ధర రూ.1,065-రూ.1,119 మధ్య నిర్ణయించారు. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు, దేశీయ మ్యూచువల్ ఫండ్స్ ఇందులో భారీగా పాల్గొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

సంబంధిత పోస్ట్

✕
✕