ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలను పెంచేందుకు టాటా మోటార్స్ కీలక నిర్ణయం తీసుకుంది. జులై నెలకు గాను పలు మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. Curvv మోడల్‌పై రూ.3.35 లక్షలు, హారియర్‌పై రూ.2.75 లక్షలు, పంచ్, టియాగోపై రూ.1.45 లక్షలు, నెక్సాన్‌పై రూ.50 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్లలో క్యాష్ బెనెఫిట్స్, ఎక్స్‌ఛేంజ్, స్క్రాపేజ్ బోనస్‌లు కూడా ఉన్నాయి. టాటా కంపెనీ సఫారీ, ఆల్ట్రోజ్ మినహా మిగతా అన్ని మోడళ్లను ఎలక్ట్రిక్ రూపంలోకి తీసుకువచ్చింది.