కేరళలో జరిగిన మహా విపత్తుకు యావత్ దేశం చలించిపోయింది. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వయనాడ్ బాధిత కుటుంబాల కోసం కేరళ సీఎం సహాయనిధికి ప్రభుత్వం తరఫున రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. అదానీ గ్రూప్ రూ.5 కోట్లు, ఆర్పీ గ్రూప్ రవి పిళ్లై, లులు ఛైర్మన్ యూసఫ్ అలీ, కల్యాణ్ జువెలర్స్ ఛైర్మన్ కల్యాణరామన్‌లు కూడా ఒక్కొక్కరు రూ.5 కోట్ల విరాళాన్ని సీఎం సహాయనిధికి అందించారు.