ముంబయి ఎయిర్‌పోర్టులో రూ.62 కోట్ల విలువైన కొకైన్ పట్టుబడింది. దోహా నుంచి ముంబయికి వచ్చిన భారతీయ మహిళ.. బిస్కెట్లు, చాక్లెట్ బాక్సుల మధ్య 300 కొకైన్ క్యాప్సుల్స్‌ను అక్రమంగా తరలిస్తుండగా డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. సోమవారం మహిళను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌పై తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.