పుణె ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత (వీడియో)

బ్యాంకాక్ నుంచి పుణెకు వచ్చిన భారతీయ ప్రయాణికుడి లగేజీలో 10.642 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.3.72 కోట్లు ఉంటుందని తెలిపారు. తొమ్మిది వాక్యూమ్ సీల్డ్ ప్యాకెట్లలో డ్రగ్స్‌ను దాచారు. 'ఫ్రీజ్ డ్రైడ్ మోంథాంగ్ దురియన్' పేరుతో లేబుల్స్ వేసి, నూడుల్స్ ప్యాకెట్లతో పాటు ఇతర ఆహార పదార్థాల మధ్య చెక్-ఇన్ బ్యాగేజీలో తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడిని ఎన్డీపీఎస్ చట్టం కింద అరెస్ట్ చేసి, నవంబర్ 18 వరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕