ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలోని బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు జరిగిన ఘటనలో మృతుల సంఖ్య 11కి చేరింది. ఈ పేలుడు ఘటనలో 18 మంది గాయపడినట్లు సమాచారం. పిప్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మనోరి గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో మృతులంతా ఆ పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో నివసించేవారేనని అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.