AP: అనకాపల్లి జిల్లా కోరుట్లలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించడంతో నలుగురు సజీవ దహనమయ్యారు. మరో ఏడుగురు గాయపడ్డారు. భారీగా మంటలు ఎగిసిపడుతుండడంతో దట్టంగా పొగలు అలముకున్నాయి. సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.