ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో మెట్రో స్టేషన్ వద్ద గేట్ నెంబర్ 1 దగ్గర పార్కింగ్ చేసిన కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు గాయపడగా, ఐదు కార్లు ధ్వంసమయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఏడు ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. పోలీసులు పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు, ఇది ఉగ్రవాద చర్యగా అనుమానిస్తున్నారు.