బాణాసంచా పరిశ్రమలో భారీ పేలుడు (వీడియో)

తమిళనాడులో భారీ పేలుడు సంభవించింది. శివకాశి సమీపంలోని కొప్పల్ నాయకన్‌పట్టిలో ఉన్న బాణాసంచా పరిశ్రమలో గురువారం సంభవించిన పేలుడు ధాటికి గోడౌన్ పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద సమయంలో 8 మంది మహిళలు పని చేస్తున్నట్లు గుర్తించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి అధికారులు తరలించారు. పేలుడు ధాటికి 4 గోడౌన్లు, చుట్టు పక్కల ఉన్న 10 ఇళ్లు ధ్వంసమయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్