ఇరాన్ లో కలకలం రేపిన భారీ పేలుడు ఘటన

ఇరాన్ లోని బందర్ అబ్బాస్ నగరంలో ఓ ఎనిమిది అంతస్తుల భవనంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ  ఘటనలో భవనంతో పాటు పలు వాహనాలు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ పేలుడు కలకలం రేపింది. గత ఏడాది కూడా బందర్ అబ్బాస్ సమీపంలో ఇలాంటి పేలుడు సంభవించింది.

సంబంధిత పోస్ట్