కాకినాడలో భారీ పేలుడు.. 7 కి.మీ మేర వినిపించిన శబ్ధం (వీడియో)

కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి సమీప ఇళ్లు దెబ్బతిన్నాయి. శబ్దం సుమారు 7 కి.మీ మేర వినిపించినట్లు స్థానికులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో చాలా మంది చనిపోయినట్టు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్