మార్కెట్లలో భారీ పతనం.. రూ.4 లక్షల కోట్లు ఆవిరి!

భారత స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా నష్టపోయాయి. అమెరికా బాండ్ ఈల్డ్స్, ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, క్రూడ్ ధరల పెరుగుదల, రూపాయి విలువ పడిపోవడం వంటి కారణాలతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు ఒక శాతం పైగా పడిపోయాయి. ఈ అమ్మకాల ఒత్తిడితో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. అమెరికా వ్యాపార కార్యకలాపాలు పెరగడంతో బాండ్ ఈల్డ్స్ 2007 తర్వాత అత్యధిక స్థాయికి చేరడం, ఫెడ్ వడ్డీ రేట్లు పెంచుతుందనే అంచనాలు, ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో క్రూడ్ ధరలు పెరగడం వంటివి మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలని నిపుణులు చెప్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕