తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

వారాంతపు సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1, నారాయణగిరి షెడ్లు నిండిపోయి, క్యూలైన్లు రింగు రోడ్డుకు 2 కిలోమీటర్ల వరకూ సాగాయి. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, శ్రీనివాసం కేంద్రాల వద్ద ఎస్‌ఎస్‌డీ టోకెన్లు దొరకక భక్తులు వేచి చూస్తున్నారు.

సంబంధిత పోస్ట్