ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులు పెట్టిన వారికి గత ఏడాది, రెండేళ్లలో నష్టాలు మిగిలాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కొన్ని సిప్ పెట్టుబడులపై 48 శాతం వరకు నష్టాలు నమోదయ్యాయి. 556 పథకాల్లో 486 నికర నష్టాలను ఇవ్వగా, 70 పథకాలు లాభాలను అందించాయి. దేశీయ పథకాలు నష్టాల్లో ఉండగా, అంతర్జాతీయ ఫండ్స్ మంచి రాబడులను అందించాయి. సిప్ పెట్టుబడులను కనీసం 7-10 ఏళ్ల పాటు కొనసాగిస్తే మెరుగైన రాబడులు పొందవచ్చని నిపుణులు అంటున్నారు.