కర్రెగుట్టల్లో మావోయిస్టుల భారీ డంప్‌ గుర్తింపు

ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లోని పూజారి కాంకేర్ వద్ద ఉన్న కర్రెగుట్టల్లో తెలంగాణ పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌లో భారీ మావోయిస్టు డంప్‌ను గుర్తించారు. ఈ రహస్య ప్రదేశంలో మావోయిస్టులకు చెందిన 280 బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భద్రతా బలగాల కదలికలు, గస్తీలో భాగంగా జరిపిన తనిఖీల్లో ఈ అక్రమ ఆయుధాల నిల్వ వెలుగులోకి వచ్చింది. ఈ ఆయుధాల స్వాధీనం మావోయిస్టుల వ్యూహాలకు పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕