గేమింగ్‌, విజువల్ ఎఫెక్ట్స్ రంగాల్లో యువతకు భారీ అవకాశాలు

గేమింగ్‌, కామిక్‌ రంగాల్లో యువతకు విస్తృత అవకాశాలు కల్పిస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌ రంగంలో 20 లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు, ముంబైలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రియేటివ్‌ టెక్నాలజీ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 15వేల సెకండరీ పాఠశాలల్లో, 500 కాలేజీల్లో కంటెంట్‌ క్రియేటర్స్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు, ప్రధాన పర్యాటక కేంద్రాల్లో 10 వేల మంది గైడ్‌లకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్