హైదరాబాద్లో భారీ కొండచిలువ కలకలం(వీడియో)

హైదరాబాద్లోని ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో, చిన్న చెరువు సమీపంలో భారీ కొండచిలువ కలకలం రేపింది. మంగళవారం ఔటర్ రింగ్ రోడ్డు పక్కన భారీ కొండచిలువను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రోడ్డు అంత పొడవున్న ఈ కొండచిలువ సంచారం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఈ కొండచిలువ వల్ల ఎవరికైనా ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ మేరకు అటవీ అధికారులకు సమాచారం అందించారు.

సంబంధిత పోస్ట్