విమాన టికెట్ రద్దుపై భారీ రీఫండ్: కేంద్రం కొత్త విధానం

విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించనుంది. అత్యవసర కారణాలతో చివరి నిమిషంలో టికెట్ రద్దు చేసుకున్నా, టికెట్ మొత్తంలో 80 శాతం వరకు రీఫండ్ పొందేలా కొత్త విధానాన్ని తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. విమాన టికెట్‌లోనే అంతర్లీనంగా ట్రావెల్ ఇన్సూరెన్స్ సౌకర్యం ప్రవేశపెట్టడం ద్వారా ఈ మార్పులు రానున్న రెండు, మూడు నెలల్లో అమలులోకి రానున్నాయి. ప్రస్తుతం 3 గంటల ముందు టికెట్ రద్దు చేస్తే నో షోగా పరిగణించి రీఫండ్ ఇవ్వడం లేదు.

సంబంధిత పోస్ట్