ఓర్క్‌లా ఇండియా ఐపీఓకు పెట్టుబడిదారుల నుంచి అద్భుత స్పందన లభించింది. రూ.1,667 కోట్ల విలువైన ఈ ఇష్యూ ముగిసే సరికి 48.73 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. NSE వివరాల ప్రకారం 1.59 కోట్ల షేర్లకు బదులుగా 77.96 కోట్ల బిడ్లు నమోదయ్యాయి. క్యూఐబీ కోటా 117.63 రెట్లు, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ 54.42 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 7.05 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యాయి. నవంబర్ 6న లిస్టింగ్ కానుంది.