డిజిటల్ వాలెట్ పేరిట భారీ స్కామ్.. ఏకంగా 1,211 కోట్లు వసూలు

గుజరాత్‌లో SD పే డిజిటల్ వాలెట్ పేరిట 6.52 లక్షల మందిని మోసం చేస్తూ రూ.1,211 కోట్ల మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామ్ వెలుగుచూసింది. పెట్టుబడులపై 9 శాతం వడ్డీ ఇస్తామని ఆశ చూపి నిందితులు ప్రజల నుంచి డబ్బు వసూలు చేశారు. ఈ ఏడాది మార్చి నుంచి చెల్లింపులు ఆగిపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దాదాపు 800 మంది ఫిర్యాదులతో స్పందించిన పోలీసులు, ధవళ్ పటేల్, నరేంద్ర సోలంకీ సహా 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా గుజరాత్‌లోనే 6 లక్షల మంది ఈ మోసానికి గురయ్యారు.

సంబంధిత పోస్ట్

✕
✕