TG: భద్రాద్రి కొత్తగూడెం(D) బూర్గంపాడు(M) సారపాకలో భారీగా గంజాయి పట్టుబడింది. కంటైనర్‌లో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 525 కిలోలున్న ఈ గంజాయి విలువ రూ.2.65 కోట్లు ఉంటుందని ఈగల్ ఫోర్స్ టీమ్ వెల్లడించింది. ఒడిశాలో గంజాయి సేకరించి కంటైనర్‌లో ప్రత్యేకంగా నిర్మించిన రహస్య గదిలో దాచి యూపీకి తరలిస్తున్నట్లు గుర్తించారు.