TG: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాచారంలో పెద్ద ఎత్తు డ్రగ్స్ పట్టుబడింది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తరలిస్తున్న క్రమంలో ఎల్బీనగర్ ఎస్‌వోటీ, నాచారం పోలీసుల సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నారు. ఇద్దరి నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.20 లక్షల విలువైన 210 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు ఉదయ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.