ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అమెరికాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అత్యాధునిక నిఘా విమానం E-3 సెంట్రీ AWACSను ఇరాన్ ధ్వంసం చేసినట్టు అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఈ ఘటన ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్‌లో చోటుచేసుకుందని పేర్కొంది. ఈ అవాక్స్ విమానానికి యుద్ధరంగంలో కీలక పాత్ర పోషిస్తూ, శత్రు కదలికలను గుర్తించే సామర్థ్యం ఉంది.