చైనాలో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు (వీడియో)

చైనాలోని వుజువాంగ్ టోల్ స్టేషన్ దగ్గర వాహనాలు కిలోమీటర్ల తరబడి నిలిచిపోయాయి. జాతీయ దినోత్సవం, మిడ్-ఆటమ్ ఫెస్టివల్ సెలవుల తర్వాత స్వదేశానికి తిరిగే ప్రయాణీకుల రద్దీ కారణంగా 1,20,000 పైగా వాహనాలు టోల్ గేట్ వద్ద బారులు తీర్చాయి. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ ట్రాఫిక్‌ జాంకి సంబంధించిన డ్రోన్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా 2010లో బీజింగ్-టిబెట్ రహదారిలో 12 రోజుల ట్రాఫిక్ జామ్ నమోదు అయ్యింది.

సంబంధిత పోస్ట్