మహారాష్ట్ర రాజధాని ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సుపై రోడ్డు పక్కనున్న భారీ వృక్షం ఒక్కసారిగా కూలిపడింది. ఈ ఘటనలో 10 మందికి పైగా విద్యార్థులు గాయపడగా, వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టి బస్సులో చిక్కుకున్న విద్యార్థులను బయటకు తీశారు. మరో చిన్నారి లోపల ఇరుక్కుపోయినట్లు సమాచారం. అతడిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.