రిమ్స్‌లో శిశువుల మృతిపై మానవ హక్కుల కమిషన్‌‌ విచారణ

TG: ఆదిలాబాద్‌‌ రిమ్స్‌‌లోని ఎస్‌‌ఎన్‌‌సీయూలో అగ్ని ప్రమాదంలో ముగ్గురు నవజాత శిశువులు మృతిచెందిన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌‌ సుమోటోగా కేసు స్వీకరించింది. సెప్టెంబర్‌‌ 21న అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంపై సమగ్ర నివేదికను అక్టోబర్‌‌ 27లోగా సమర్పించాలని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిని కమిషన్‌‌ ఆదేశించింది. భద్రతా ఏర్పాట్లు, విద్యుత్‌‌ వ్యవస్థ నిర్వహణ, అత్యవసర తరలింపు చర్యలపై కమిషన్‌‌ ఆరా తీసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕