ఆకలిగా ఉన్నప్పుడు తినకపోతే కేవలం గ్యాస్, కడుపు నొప్పి మాత్రమే కాదు, మెదడు పనితీరు తీవ్రంగా దెబ్బతింటుంది. గ్లూకోజ్ స్థాయిలు పడిపోవడంతో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గి, ఆలోచనాశక్తి సన్నగిల్లుతుంది. ఒత్తిడి హార్మోన్ కార్టిసోల్ పెరిగి, తెలియకుండానే ఎక్కువ ఆహారం తీసుకుని బరువు పెరిగే అవకాశం ఉంది. మెటబాలిజం తగ్గి, కొవ్వు నిల్వలు పేరుకుపోతాయి. ఆకలిగా అనిపించినప్పుడు వెంటనే భోజనం చేయాలి, లేదంటే పండ్లు, నట్స్ వంటివి తీసుకోవడం మంచిది.