మావోయిస్టుల కోసం వేట.. 5 జిల్లాల్లో తనిఖీలు

ఏపీలో మావోయిస్టుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. 5 జిల్లాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, అల్లూరి జిల్లాల్లో సోదాలు చేస్తున్నారు. విజయవాడలోని కొత్త ఆటోనగర్, కాకినాడలో జరిపిన తనిఖీల్లో ఓ బిల్డింగ్‌లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభించాయి. రాష్ట్రంలో మావోయిస్టులు విధ్వంసానికి కుట్ర పన్నినట్లు భావిస్తున్నారు. ఇక్కడ నుంచే ఎక్కడెక్కడ దాడులు చేయాలని ప్లాన్ చేసినట్లు అనుమానిస్తున్నారు. 12 మంది అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్