రెండు బైక్‌లు ఢీ.. భార్యాభర్తలు మృతి

TG: కామారెడ్డి జిల్లా, రామారెడ్డిలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఢీకొనడంతో బాలమణి (38), రాజయ్య (45) అనే భార్యాభర్తలు మృతి చెందారు. ఈ దుర్ఘటనలో మరో ఇద్దరు యువకులు గాయపడ్డారు. మృతులు రామారెడ్డికి చెందినవారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕