రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం

TG: మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపల్ కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప జిల్లాకు చెందిన శేషయ్య (73), అతని భార్య నవనీతమ్మ (64) మరణించారు. సంగారెడ్డిలో కుమారుడిని కలిసి, హైదరాబాద్ ప్రాపర్టీస్ చూసుకుని తిరుపతిలో ఉన్న కూతురు వద్దకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే జాతీయ రహదారి బ్రిడ్జిపై వెనుక నుండి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్