TG: ఆదిలాబాద్ పట్టణంలోని పిట్టలవాడలో శనివారం విషాదం చోటు చేసుకుంది. ఒక రోజు వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి చెందారు. ఆదిలాబాద్ ఎక్సైజ్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న నైతం నవీన్ కుమార్ (33) అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన భార్య నైతం లత (31) పచ్చకామెర్లతో బాధపడుతుండగా చికిత్స తీసుకుని శుక్రవారం జగిత్యాల నుంచి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. శనివారం ఆమె అంత్యక్రియలు జరిగాయి. అదే రోజు రాత్రి భార్య మరణ వార్తను తట్టుకోలేక నవీన్ కూడా తుది శ్వాస విడిచారు. దీంతో ఆ ప్రాంతాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.