TG: జీడిమెట్లలో కల్తీ కల్లు కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా భోపాల్‌కు చెందిన భార్యాభర్తలు రామ్ రెడ్డి నగర్‌లోని కల్లు దుకాణంలో కల్లు తాగి అస్వస్థతకు గురయ్యారు. లచ్చిరాం, సాక్రిభాయ్ దంపతులు రెండు రోజుల క్రితం గాజుల రామారంలో నివసిస్తున్న తమ కూతురు రేఖ దగ్గరికి వచ్చారు. కల్లు అలవాటు ఉండటంతో ఆదివారం సాయంత్రం వారు కల్లు తాగారు. కాళ్లు, చేతులు లాగడం, పిచ్చిగా ప్రవర్తించడంతో వారిని కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు.