లోన్ చెల్లింపుపై గొడవ.. భార్య ముక్కు కొరికేసిన భర్త

కర్ణాటకలోని దేవనగరిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ దంపతులు లోన్ చెల్లింపుల విషయంలో తీవ్రంగా వాగ్వాదానికి దిగారు. ఆర్థిక సమస్యల నేపథ్యంలో ఏర్పడిన చిన్న గొడవ వివాదంగా మారింది. కోపంతో భర్త, భార్యపై దాడికి పాల్పడి ఆమె ముక్కును కొరికేశాడు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరింది. స్థానికులు ఈ ఘటనను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి భర్తను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్