భార్యను కత్తితో దారుణంగా హత్య చేసిన మహిళ

TG: సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్ద మండలం ఇరాక్‌పల్లి గ్రామంలో కుటుంబ కలహాలు దారుణ హత్యకు దారితీశాయి. భర్త సయ్యద్ ముల్తాన్, క్షణికావేశంలో భార్య ఇర్ఫానాను  కత్తితో అత్యంత దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని స్థానిక దర్గాలోని పీర్ల ముందు పడేసి, నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఆరు నెలలుగా పుట్టింట్లో ఉంటున్న ఇర్ఫానా, వారం రోజుల క్రితమే భర్త వద్దకు తిరిగి వచ్చింది. కుటుంబ కలహాలు, భార్యపై అనుమానం వంటి అంశాలే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్