భార్య మందలించిందని భర్త ఆత్మహత్య

మద్యం తాగుతున్నాడని భార్య మందలించడంతో మనస్తాపానికి గురైన భర్త మద్యం మత్తులోనే గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ములుగు జిల్లా శంకర్ రాజ్‌పల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. స్థానిక తాటి కృష్ణంరాజు మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో ఆయన భార్య ఆదిలక్ష్మి పలుమార్లు మందలించింది. మనస్తాపానికి గురైన ఆయన క్షణికావేశంలో గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్