TG: వరంగల్ జిల్లా కాజీపేట వద్ద రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యకు వీడియో కాల్ చేసి చూపిస్తూ రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. మృతుడు డాక్యుమెంట్ రైటర్ రాజేశ్‌నాయక్(45) గా గుర్తించారు. ఆస్తి పంపకాల విషయంలో కొంతకాలంగా కుటుంబసభ్యుల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఆదివారం రాత్రి భార్యతో గొడవపడి బయటకు వెళ్లిపోయి సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.