ఒడిశాలోని బలాంగీర్ జిల్లాలో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశాయి. శనివారం భార్య మొబైల్ ఫోన్‌తో తలపై బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడి భర్త మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు చికిత్స అందించడంతో ఆరోగ్యం మెరుగుపడింది. దీంతో డిశ్చార్జ్ చేశారు. అయితే కొద్దిసేపటికే ఆరోగ్యం క్షీణించి సదరు వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.