బెంగళూరుకు చెందిన 37 ఏళ్ల వ్యక్తి తన భార్య లైంగికంగా చిత్రహింస పెడుతోందని, అత్తింటివారు కూడా వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జులై 4, 2024న రెండు కుటుంబాలు కలసి సమస్య పరిష్కారానికి ప్రయత్నించినా విఫలమయ్యాయని చెప్పాడు. భార్య 1.87 లక్షల నగదు, బంగారం, వెండి ఆభరణాలు తీసుకుని చెన్నైకి వెళ్లిపోయిందని, తన ల్యాప్‌టాప్‌లోని వెడ్డింగ్ ఫోటోలు, వీడియోలను డిలీట్ చేసిందని ఆరోపించాడు. ఈ నేపథ్యంలో భార్య కూడా భర్తపై తీవ్ర ఆరోపణలు చేస్తూ తమిళనాడులో కేసు నమోదు చేసింది.