మతిస్థిమితం లేక మూడు నెలల క్రితం తప్పిపోయిన భార్యను గుర్తించి ఓ వ్యక్తి బోరున విలపించారు. ఇందుకు సంబంధించిన ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డు పక్కన నిస్సహాయ స్థితిలో పడి ఉండగా, ఆమె వద్దకు వెళ్లి గుండెలకు హత్తుకున్నాడు. ఈ దృశ్యం అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది. ఈ సంఘటన బంగ్లాదేశ్‌లో జరిగినట్లు తెలుస్తోంది. కాగా సంఘటన భార్యాభర్తల మధ్య ఉండే స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనం అని నిరూపిస్తోంది.