భరణం చెల్లించాలని కోర్టుకెళ్లిన భర్త

యూపీలో జ్యోతి మౌర్య అనే మహిళ PCS అధికారిగా మారిన తర్వాత తన భర్తతో విడాకులు కోరిన కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా భర్త ఆలోక్ తనకు భరణం చెల్లించాలని కోర్టును ఆశ్రయించారు. జ్యోతి తనకంటే ప్రస్తుతం ఎక్కువగా సంపాదిస్తుందని, కావున తనకు భరణం చెల్లించాలని కోరాడు. తన జీతం సరిపోవట్లేదని, జీవనానికి కష్టంగా ఉందని, వైవాహిక వివాదం పరిష్కారం కాకముందు వరకు తనకు భృతి అందించాలని పిటిషన్‌లో పేర్కొన్నాడు.

సంబంధిత పోస్ట్