భార్య, ఆమె ప్రియుడిని నరికి చంపిన భర్త!

తమిళనాడులోని విరుదునగర్ జిల్లా పాళయంపట్టిలో వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. భార్య పొన్నళగు, ప్రియుడు ఆనందరాజ్‌ల వివాహేతర సంబంధంపై కోపంతో మహిళ భర్త శరవణకుమార్ ఇద్దరినీ దారుణంగా హతమార్చాడు. ఏకాంతంగా ఉన్న సమయంలో కొడవలి, రాయితో దాడి చేసి వారిని చంపినట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శరవణకుమార్‌ను అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ గౌతమ్ గోయల్ దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు.

సంబంధిత పోస్ట్

✕
✕