రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం పులిగోనిపల్లి తండాలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో భర్త రాందాస్, తన భార్య కవిత (28), కుమారుడు హర్ష (7) లపై కత్తి, రోకలి బండతో దాడి చేశాడు. ఈ ఘటనలో భార్య, కొడుకు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. కుమార్తె ప్రణిత (10) పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని సమాచారం. పోలీసులు నిందితుడు రాందాస్ నాయకన్ ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.