TG: సంగారెడ్డి జిల్లాలో కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను కత్తితో పొడిచి భర్త హత్య చేసిన కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాగల్‌గిద్ద(M) ఇరాక్‌పల్లి గ్రామానికి చెందిన సయ్యద్ ముల్తాన్, ఇర్ఫానా దంపతుల మధ్య ఇటీవల గొడవలు జరగడంతో, ఇర్ఫానా 6 నెలలుగా పుట్టింట్లోనే ఉంటోంది. ఇటీవల గ్రామ పెద్దల జోక్యంతో తిరిగి భర్త వద్దకు వచ్చిన వారం రోజులకే, మరోసారి గొడవ జరగడంతో సయ్యద్ ఆవేశంలో కత్తితో దాడి చేసి భార్యను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని దర్గా సమీపంలో పడేసి పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.