TG: హైదరాబాద్ మీర్‌పేట్‌లో దారుణం చోటుచేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను కత్తితో హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలం శివన్నగూడెంకు చెందిన నరసింహ (60) తన భార్య వసంతతో కలిసి బీఎన్ రెడ్డి నగర్ టీచర్స్ కాలనీలో నివసిస్తున్నాడు. భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానంతో బుధవారం తెల్లవారుజామున కత్తితో మెడపై దాడి చేశారు. దీంతో వసంతకు తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.