తమిళనాడు కోయంబత్తూరులోని తిరునెల్వేలి దరువై ప్రాంతానికి చెందిన బాలమురుగన్ తన భార్య శ్రీప్రియను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఇద్దరు పిల్లలున్నా, అభిప్రాయబేధాల కారణంగా శ్రీప్రియ కోయంబత్తూరులోని హాస్టల్‌లో ఒంటరిగా ఉంటూ ఉద్యోగం చేసేది. శ్రీప్రియ, తన బంధువు ఇసక్కిరాజాతో సన్నిహితంగా ఉందనే అనుమానంతో పాటు, ఇసక్కిరాజా వాట్సాప్ స్టేటస్‌లో శ్రీప్రియతో ఉన్న ఫోటో పెట్టడంతో కోపోద్రిక్తుడై హాస్టల్‌కు వెళ్లి హత్య చేశాడు. అనంతరం మృతదేహంతో సెల్ఫీ తీసి వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు. పోలీసులు బాలమురుగన్‌ను అరెస్టు చేశారు.