వేటకత్తితో భార్యను నరికి.. అదే కత్తితో మెడ కోసుకున్న భర్త

AP: ఏలూరు జిల్లా కలిదిండి మండలం కట్టావారిపాలెంలో దారుణం చోటుచేసుకుంది. కట్టా పెద్దిరాజు అనే వ్యక్తి వేటకత్తితో తన భార్య జయలక్ష్మీ (45)ని నరికి చంపేశాడు. అనంతరం అదే కత్తితో తన మెడ కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడిన పెద్దిరాజుని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్